నాగార్జున సోదరి నాగసుశీలపై కేసు నమోదు

by GSrikanth |
నాగార్జున సోదరి నాగసుశీలపై కేసు నమోదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ టాలీవుడ్ హీరో నాగార్జున సోదరి నాగసుశీలపై కేసు నమోదయ్యింది. శ్రీజ ప్రకృతి దర్శపీఠం ఆశ్రమంపై దాడి చేశారని బాధితులు ఫిర్యాదు చేయడంతో మొయినాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 12న నాగసుశీల మరికొంత మంది కలిసి శ్రీనివాసరావు ఇంటిపై దాడి చేశారని ఆరోపిస్తూ బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. కాగా, గతంలో నాగసుశీల తన వ్యాపార భాగస్వామి అయిన నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావుతో కొన్నేళ్లుగా భూ వివాదాలు ఉన్నాయి.

ఈక్రమంలోనే నాగసుశీల తన వ్యాపపార భాగస్వామిపై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నాగసుశీల ఫిర్యాదు చేసి వార్తల్లో నిలిచారు. తన భూమిని విక్రయించి నగదు దుర్వినియోగం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వివాదాల కారణంగా శ్రీనివాస్ నాగసుశీలపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story