3 నెలలు 6 బిగ్ సినిమాలు.. రచ్చ రచ్చ చేయనున్న స్టార్స్..

by Disha News Desk |
3 నెలలు 6 బిగ్ సినిమాలు.. రచ్చ రచ్చ చేయనున్న స్టార్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: సమ్మర్ హీట్ పెంచేందుకు బడా హీరోలంతా రెడీ అవుతున్నారు. సమ్మర్ వరుస సినిమాలతో స్టార్ హీరోలు రేస్‌కు రెడీ అంటున్నారు. బడా హీరోలందరూ సమ్మర్ పోరుపై కన్నేశారు. దీంతో సమ్మర్ డేట్స్ మొత్తం ఫుల్ అయిపోయాయి. కేవలం 3 నెలల్లో 6 బడా ప్రాజెక్టులు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. దీంతో కాస్త చిన్న సినమాలన్నీ సమ్మర్‌కు దూరంగా జరుగుతున్నాయి. ఈ సమ్మర్ రేస్‌ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్ట్ చేయనున్నాడు. మార్చి 11న 'రాధేశ్యామ్' గ్రాండ్ రిలీజ్‌తో 2022 సమ్మర్ రేస్ స్టార్ట్ అవుతోంది. ఆ తర్వాత వరుసగా మార్చి 25న 'ఆర్ఆర్ఆర్' యుద్ధ భేరి మోగించేందుకు సిద్ధం అవుతోంది.

అనంతరం దండయాత్ర చేయడానికి యశ్ తన 'కేజీఎఫ్ 2'తో సన్నద్ధం అవుతున్నాడు. ఈ గ్యాప్‌లో అందరినీ కడుపుబ్బా నవ్వించేందుకు వెంకీ, వరుణ్ తేజ్ 'ఎఫ్3'తో ఏప్రిల్ 28కి వస్తున్నారు. ఆ తర్వాత చిరు 'ఆచార్య'తో ఏప్రిల్ 29న పాఠాలు చెప్పేందుకు రానున్నాడు. చిరు పాఠాలు చెప్పిన కొన్నాళ్లకు మే 12న మహేష్ 'సర్కారు వారి పాట'తో అందరి అలరించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సమ్మర్ రేస్‌ను స్టార్ట్ చేసేందుకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ కూడా రెడీ అవుతున్నాడు. ఒకవేళ పవన్ 'భీమ్లా నాయక్' ఫిబ్రవరి 25న మిస్ అయితే ఏప్రిల్ 1న సమ్మర్ పోరును పక్కా మాస్‌గా స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. మరి ఈ సమ్మర్‌లో ఏ సినిమా ఎంత హీట్ పెంచుతుందో చూడాలి.

Advertisement

Next Story