Star Hero: 23 సర్జరీలు.. 4 ఏళ్లు వీల్ చైర్‌కే పరిమితం.. కట్ చేస్తే స్టార్ హీరో

by Kavitha |
Star Hero: 23 సర్జరీలు.. 4 ఏళ్లు వీల్ చైర్‌కే పరిమితం.. కట్ చేస్తే స్టార్ హీరో
X

దిశ, సినిమా: స్టార్ హీరో విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్‌లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అపరిచితుడు, మల్లన్న, ఐ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. అయితే ఇతను నటించిన అపరిచితుడు మూవీకి ఇప్పటికీ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పడంలో అతియోశక్తి లేదు. కానీ.. ఈ మూవీ తర్వాత ఆ రేంజ్‌లో విక్రమ్‌కు మరో హిట్టు పడలేదనే చెప్పుకోవాలి. దాంతో తెలుగులో ఆయన మార్కెట్ పూర్తిగా పడిపోయే స్టేజ్‌కు వచ్చింది. అయితే ప్రస్తుతం విక్రమ్ నటించిన ‘తంగలాన్’ మూవీ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇప్పటికే రిలీజైన టీజర్‌లు, గ్లింప్స్ ఆడియెన్స్‌లో ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేశాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు స్టార్ హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న విక్రమ్.. ఒకప్పుడు 4ఏళ్ల పాటు వీల్ చైర్‌కే పరిమితమయ్యాడని మీలో ఎంత మందికి తెలుసు..? అప్పటి ఆ గడ్డుకాలాన్ని దాటుకొని వచ్చి ఈ రోజు స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. మరి ఆ వివరాల్లోకి వెళితే.. విక్రమ్ తన 12ఏళ్ల వయసులో ఒక యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయాలపాలైయ్యాడు. కుడి కాలు కూడా తీసేసే స్టేజ్‌‌కు వెళ్లాడు. కానీ విక్రమ్ వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదు. దాంతో ఆ కాలును తీసేయకుండా కాపాడేందుకు 23 సర్జరీలు చేశారట. ఇక ఆ యాక్సిడెంట్ తర్వాత దాదాపు 4 ఏళ్ల పాటు వీల్ చైర్‌కే పరిమితం అయ్యాడు. ఈ విషయాన్ని విక్రమ్ స్వయంగా ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.




Advertisement

Next Story