- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మొదటి చిత్రమే భారీ బడ్జెట్.. హైప్ పెంచేస్తున్న బాలయ్య వారసుడు!
దిశ, సినిమా: నందమూరి నటవంశం నుంచి తెలుగుతెరకు పరిచయం కాబోతున్న మరో వారసుడు నందమూరి బాలకష్ణ తనయుడు మోక్షజ్ఞ. డ్యాన్సులు, నటనలో శిక్షణ పొంది సినిమాల్లోకి రంగ ప్రవేశం చేయడానికి సిద్ధమైన నందమూరి మోక్షజ్క్ష నటించనున్న తొలిచిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. హనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా దర్శకుడిగా ప్రశంసలు అందుకున్న ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. సుధాకర్ చెరుకూరితో పాటు నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని ఈ మూవీని నిర్మిస్తోంది. దసరాకు ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. అయితే ఈ చిత్రం దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారని సమాచారం.
విజువల్‌గా గ్రాండియర్‌గా ఉండటంతో పాటు సాంకేతికంగా కూడా ఈ చిత్రాన్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దాలనే ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్. ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్‌కు కూడా ప్రాధాన్యత ఉందని తెలిసింది. అందుకే చిత్ర బడ్జెట్ విషయంలో నిర్మాత ఎక్కడా రాజీపడకుండా నిర్మించాలనే ఆలోచనలో వున్నారట. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి విషయంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతో కేర్ తీసుకుంటున్నారని తెలసింది. నందమూరి బాలకృష్ణ ఎంతో నమ్మకంతో తన వారసుడిని పరిచయం చేసే బాధ్యతను తన మీద ఉంచారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి తన హాండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్‌ను పెడతానని ప్రశాంత వర్మ చెబుతున్నారు.