భారీ భద్రతతో పోలింగ్ బాక్సులు నల్లగొండకు తరలింపు.

by Shyam |   ( Updated:2021-12-10 09:07:10.0  )
భారీ భద్రతతో పోలింగ్ బాక్సులు నల్లగొండకు తరలింపు.
X

దిశ, సూర్యాపేట కలెక్టరేట్: జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి అన్నారు. సోమవారం జిల్లాలోని హుజూర్‌నగర్-6, కోదాడ-7, సూర్యాపేట-8 పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రశాంతంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, ఎన్నికలు నిర్వహించామని అన్నారు. ఉదయం 10. గంటలకు 0.99 శాతంగా ఉంది.

అలాగే 12.00 గంటలకు 43.28 శాతం, 2 గంటలకు 84.08 శాతం, 4 గంటలకు 97.01 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు కలెక్టర్ తెలిపారు. మొత్తం 402 ప్రజా ప్రతినిధులకు గాను 390 మంది ప్రజా ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. పోలింగ్ అనంతరం సహాయ రిటర్న్‌నింగ్ అధికారి, అదనపు కలెక్టర్ యస్ మోహన్ రావు ఆధ్వర్యంలో సెక్టోరియల్, రూట్ అధికారుల సమక్షంలో నల్గొండ కేంద్రంకు పోలీస్ ఎస్కార్ట్‌తో మూడు కేంద్రాల పోలింగ్ బాక్సులు పంపించడం జరిగిందని అన్నారు.

Advertisement

Next Story