మోత్కుపల్లి టీఆర్‌ఎస్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్

by Shyam |   ( Updated:2021-10-06 11:38:51.0  )
Former-minister-Motkupalli-
X

దిశ, తెలంగాణ బ్యూరో: మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ లో చేరనున్నారు. అందుకుగాను తేదీ ఫిక్స్ అయింది. ఈ నెల 10న టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఆయన అనుచరులు తెలిపారు. గత నాలుగైదు నెలలుగా ఏ పార్టీలో చేరతారు.. అసలు చేరతారా.. లేదా?.. అధికార పార్టీలోనే చేరుతారని ప్రచారం జరిగింది. అయినప్పటికీ చేరికపై క్లారిటీ రాలేదు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో అసెంబ్లీకి సోమ, మంగళవారం వరుసగా వచ్చి సీఎం కేసీఆర్ ను కలిశారు. పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. అయితే దళిత బంధు పథకానికి చైర్మన్ గా నియమించనున్నారనే ప్రచారం జరుగుతుంది.

మోత్కుపల్లి దళిత వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పాటు 30 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. దీనికి తోడు ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మినహా ఇతర పార్టీలపై విమర్శలు చేయడం ఆయన నైజం. అయితే బీజేపీకి రాజీనామా చేసి నెలలు గడుస్తున్నా.. ఏ పార్టీలో చేరే విషయంపై మాత్రం స్పష్టత నివ్వలేదు. దళిత బంధు పథకంపై జరుగుతున్న సమావేశాలకు వెళ్తుండటం, సీఎం కేసీఆర్ పై ప్రశంసలు కురిపించడం లాంటివి చేస్తున్నారు. కానీ పార్టీలో చేరికపై దాటవేసే ధోరణి అవలంభిస్తూ వస్తున్నారు. రైతుబంధు సమితి మాదిరిగా దళిత బంధు సమితిగా నామకరణం చేసి దానికి మోత్కుపల్లిని చైర్మన్ గా నియమిస్తారనే ప్రచారం జరుగుతుంది. దీనికి తోడు మోత్కుపల్లి సైతం తనకు చైర్మన్ పదవి ఇస్తానని సీఎం హామీ ఇచ్చారని తన అనుచరులకు చెప్పుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed