అయ్యో.. ఎంత కష్టం వచ్చింది బామ్మా నీకు

by Sumithra |
old Mother
X

దిశ, కోదాడ: తొమ్మిది నెలలు మోసి అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకులే కన్నతల్లిని కాదు పొమ్మన్నారు. ముసలితనంలో ఆసరాగా ఉండాల్సింది పోయి నడిరోడ్డుపై వదిలేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం అల్వాలపురం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. గ్రామానికి చెందిన వృద్ధురాలు బూతం శాంతమ్మకు నలుగురు సంతానం. అందులో ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే.. ఇటవల శాంతమ్మను గేదె తన్నడంతో తొంటితో కాలు విరిగింది. దీంతో తన పనులు కూడా తాను చేసుకోలేక, కూర్చున్న చోటునుంచి కదదలేక, కొడుకులు, కూతుళ్లు తనను పట్టించుకోక తీవ్ర ఇబ్బందులు పడుతోంది.

ఆస్పత్రిలో చూపించి వైద్యం చేయించాలని కుమారులను ఎంత వేడుకున్నా.. ఆ తల్లిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఉన్న ఆస్తి మొత్తాన్ని పంచుకొని కనీసం తల్లి ఎలా ఉందో కన్నెత్తి కూడా చూడటం లేదని వాపోతోంది ఆ బామ్మ. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం నుంచి తీవ్రమైన నొప్పులతో ఇంటి గుమ్మం ముందు బాధ అనుభవిస్తున్నా.. తల్లిని కన్నెత్తి కూడా చూడకుండా వాళ్ల పని వారు చేసుకుంటున్నారు. చివరికి ఆమెకు వచ్చే వృద్దాప్య ఫించను కూడా లాక్కంటూ తల్లిని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఆమె పరిస్థితిని చూసి చలించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పోలీసులు కొడుకులకు సర్దిచెప్పడంతో నామమాత్రంగా చూస్తున్నట్టు నటిస్తున్నారు. దీంతో ఆమె రోధనను చూస్తున్న స్థానికులు ప్రభుత్వ అధికారులు స్పందించి, ఆమెను ఆదుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Next Story