పట్టపగలే కిడ్నాప్‌కు యత్నం.. పసిగట్టిన తల్లి

by Shamantha N |

దిశ, వెబ్ డెస్క్: పట్టపగలే ఇద్దరు దుండగులు ఓ చిన్నారిని కిడ్నాప్ చేయడానికి యత్నించారు. గమనించిన తల్లి అప్రమత్తం కావడంతో పరుగులు తీసారు. ఈ ఘటన బుధవారం ఢిల్లీలోని షకాపూర్ ఏరియాలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. షకాపూర్ ఏరియాలోని ఓ ఇంట్లో చిన్నారి ఆడుకుంటుంది. బైక్ పైన వచ్చిన ఇద్దరు దుండగులు ఆ చిన్నారికి ఎత్తుకుని వెళుతుండగా గమనించిన తల్లి వారి వెంట పరుగులు తీసి, వాళ్ల దగ్గర నుంచి చిన్నారిని లాక్కుంది. అంతలో అప్రమత్తమైన కాలనీ వాసులు వారి బైకులు అడ్డం పెట్టి దుంగలను పడేశారు. దీంతో వాళ్ల బైక్ అక్కడే పడేసి పరుగులు తీసారు. అనంతరం చిన్నారి తల్లి పోలీసులకు విషయం చెప్పింది. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలించిన పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని, విచారించగా వారిలో ఒకరు చిన్నారి సమీప బంధువేనని గుర్తించారు.

Advertisement

Next Story