కన్నకొడుకుపై కిరోసిన్ పోసి.. తల్లి ఘాతుకం!

by Sumithra |
కన్నకొడుకుపై కిరోసిన్ పోసి.. తల్లి ఘాతుకం!
X

దిశ, వెబ్‌డెస్క్ :

కన్నకొడుకును ఓ తల్లి దారుణంగా హత్య చేసింది. నిద్రిస్తున్న సమయంలో అతనిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఈ ఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని ఖిలా వరంగల్‌లో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ నరేశ్ కథనం ప్రకారం.. నగరంలోని పడమర కోటకు చెందిన కోండ్ర రాజేంద్ర ప్రసాద్ (40) వివాహమైంది. సుమారు 15 ఏళ్ల కిందట భార్యా పిల్లలతో గొడవపడి వారికి దూరంగా తల్లి సరోజనితో కలిసి ఉంటున్నాడు.

గత కొంతకాలంగా మద్యానికి బానిసైన అతను.. డబ్బుల కోసం నిత్యం తల్లిని వేధించేవాడు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి తల్లితో గొడవ పడ్డాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సరోజన.. రాజేంద్రప్రసాద్‌ పడుకున్నాక కిరోసిన్ పోసి నిప్పంటించి హత్యచేసింది. సమాచారం అందుకున్న వరంగల్ ఏసీపీ కిరణ్‌ కుమార్ ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి సోదరుడు వేణు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరేశ్ కుమార్ వెల్లడించారు.

Advertisement

Next Story