అర్ధరాత్రి అత్త రాసలీలలు.. కోడలు చూడడంతో ప్రియుడిని ఆమె గదిలోకి పంపి

by Anukaran |   ( Updated:2021-10-18 04:25:57.0  )
అర్ధరాత్రి అత్త రాసలీలలు.. కోడలు చూడడంతో  ప్రియుడిని ఆమె గదిలోకి పంపి
X

దిశ, వెబ్‌డెస్క్: వివాహేతర సంబంధాలు కుటుంబంలో చిచ్చు పెడుతున్నాయి. కామ కోరికలతో రగిలిపోతూ వావివరుసలు, పెద్దా,చిన్నా అనే విచక్షను మర్చిపోతున్నారు. ఈ కామ మోజులో సొంత అనుకున్నవారిని చంపడానికి కూడా వెనుకాడడం లేదు. తాజాగా ఒక అత్త తన వివాహేతర సంబంధాన్ని నిలదీసిందని కోడలిని, ఆమె ప్రియుడితో కలిసి అతికిరాతకంగా హత్య చేసిన ఘటన వికారాబాద్ జిల్లాలో వెలుగుచూసింది.

వివరాలలోకి వెళితే.. పరిగి మండలం నస్కల్ గ్రామంలో మంగమ్మ(51) కొడుకు, కోడలుతో కలిసి నివసిస్తోంది. మంగమ్మ భర్త నర్సింహులు అనారోగ్యంతో కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో మంగమ్మ అదే గ్రామానికి చెందిన నఫీస్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇంట్లో ఎవరూలేని సమయంలో అతడిని ఇంటికి పిలిపించుకొని కామక్రీడలలో మునిగితేలేది. ఒకరోజూ అర్ధరాత్రి అత్త రాసలీలలను కోడలు కనిపెట్టింది. దీంతో కోడలు, అత్తకు వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి పాడుపనులు మానుకోకపోతే కొడుకుకు చెప్పి బయటకు గెంటించేస్తానని బెదిరించింది.

ఇక ఈ విషయం ఎక్కడ కొడుకుకు తెలుస్తుందేమో అని ఒక పక్క, ప్రియుడిని వదలాల్సివస్తుందని మరోపక్క భయపడిన మంగమ్మ కోడలిని హతమార్చడానికి ప్లాన్ వేసింది. ఆమె ప్రియుడు కూడా ఓకే అనడంతో ఆదివారం అర్ధరాత్రి కోడలు నిద్రిస్తుండగా అత్త ప్రియుడు నఫీస్, కోడలి గొంతునులిమి చంపేశాడు. అనంతరం ఏమి తెలియనట్లు పరారయ్యారు. ఉదయం స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల విచారణలో అత్తాకోడళ్ల మధ్య జరిగిన వివాదం బయటకు రావడంతో అత్త మంగమ్మను విచారించగా.. నిజం బయటపడింది.

Advertisement

Next Story