- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
45 ఏళ్ల ఆంటీతో 21 ఏళ్ల టీనేజర్ అలా చేస్తుండగా..
దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లయి ఐదుగురు కుమార్తెలున్న ఓ 45 ఏళ్ల మహిళ.. 21 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. అతడిపై మోజుతో తన ఐదుగురు కుమార్తెలను ఇంటిలో నుంచి గెంటేసిన ఆ మహిళ.. నాలుగో వివాహానికి సిద్ధమైన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని భిండ్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఝాన్సీ మొహల్లా గ్రామానికి చెందిన 45 ఏళ్ల మహిళ.. మిథున్ అనే 21 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఇష్టంగా మారడంతో ఇరువురూ చాలాకాలం పాటు సహజీవనం కూడా చేశారు.
అయితే, ఈ వ్యవహారాన్ని ఆమె కుమార్తెలు మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇంట్లో ఎదిగిన ఆడపిల్లలుండగా ఇటువంటి పనులేంటని తల్లిని కుమార్తెలు నిలదీశారు. యువకుడి మత్తులో ఉన్న ఆమె.. పిల్లలు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఈ క్రమంలో.. రెండో కుమార్తెను ఏడాది క్రితమే ఇంట్లో నుంచి తరిమేసింది. ఇక, ప్రస్తుతం ఆ యువకుడితో వివాహానికి సిద్ధమైంది. ఈ వివాహానికి అడ్డు చెబుతున్న నలుగురు కుమార్తెలను కూడా బయటకు పంపేసింది.
తల్లి వ్యవహారశైలి నచ్చని ఆమె కుమార్తెలు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదుతో సదరు మహిళను స్టేషన్‌కు తీసుకొచ్చిన పోలీసులు.. ఆమె ప్రియుడ్ని కూడా పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన కౌన్సెలింగ్‌తో ప్రియుడు ఆమెతో పెళ్లికి నిరాకరించాడు.