- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విషాదం.. జ్యూసులో పురుగుల మందు కలిపి తల్లి తాగి, ఇద్దరు కూతుళ్లు..
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో విషం తాగిన తల్లి చికిత్స పొందుతూ చనిపోగా, ఇద్దరు కూతుర్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమర్యాగడి తండాకు చెందిన హన్సీ తను పురుగుల మందు తాగి, తన ఇద్దరు కూతుళ్లు పూజ( 9), నందు(6)లకు పురుగుల మందును ఫ్రూట్ జ్యూసులో కలిపి తాగించింది. అది గమనించిన స్థానికులు వెంటనే వారిని కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ఈ క్రమంలో హన్సీ మృతి చెందాగా, పిల్లలు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్లారెడ్డి పోలీసులు పేర్కొన్నారు.
Advertisement
Next Story