ఎమ్మార్వో కార్యాలయం ఎదుట తల్లీకొడుకు ఆత్మహత్యాయత్నం

by Shyam |   ( Updated:2021-07-12 12:18:27.0  )
ఎమ్మార్వో కార్యాలయం ఎదుట తల్లీకొడుకు ఆత్మహత్యాయత్నం
X

దిశ, స్టేషన్ ఘన్ పూర్: మా భూమిని పరాయి వ్యక్తులకు పట్టా చేసి మాకు అన్యాయం చేస్తున్నారని రెవెన్యూ అధికారుల తీరును నిరసిస్తూ తహశీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని తల్లి కొడుకులు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన సోమవారం వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండల కేంద్రంలో జరిగింది. తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది అప్రమత్తంతో పెను ప్రమాదం తప్పింది. బాధితులు వేలేరు మండల కేంద్రానికి చెందిన మహ్మద్ మహబూబి, ఆమె కూమారుడు ఖాసీం కథనం ప్రకారం…. వేలేరులో సర్వే నంబర్ 729/ ఏ 2 లో 0.14 గుంటలు, 729/ బిలో 0.26 గుంటల భూమిని 2005లో రూ. 41 వేలకు తమ తండ్రి అబ్బసలి కొనుగోలు చేసినట్లు వారు తెలిపారు.

అయితే తాను సాదాబైనామాలో దరఖాస్తు చేసుకోగా.. తన తల్లి మహబూబి పేరిట 1బి పహణి వచ్చిందని అన్నారు. అనంతరం రెవెన్యూ అధికారులు ఫీల్డ్ ఎంక్వైరీ చేయగా.. గత పదిహేను సంవత్సరాల నుండి తాము కాస్తులో ఉన్నామని అధికారులకు ధృవీకరించారు. అయితే కొందరు వ్యక్తులు 2005లో భూమి అమ్మలేదని, 2018లో రెవెన్యూ అధికారులకు డబ్బులు ముట్టజేప్పి వారి పేరుపై పట్టా మార్పిడి వేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆలస్యంగా తెలుసుకున్న తాము అక్రమంగా జరిగిన పేరు మార్పిడిని సరిచేసి తమ పేరున పట్టా చేయాలని తహశీల్దార్ కార్యాలయం చూట్టూ తిరుగుతున్నట్లు తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా అధికారులు, రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులను పట్టించుకోలేదన్నారు. కష్టార్జితంతో కొనుగోలు చేసిన భూమిని పరాయి వ్యక్తులకు పట్టా చేయడాన్ని నిరసిస్తూ ఆత్మహత్యకు సిద్ధమయినట్లు తెలిపారు

Advertisement

Next Story

Most Viewed