చెరువులో తల్లీకూతుళ్ల శవాలు.. చనిపోయారా..? చంపేశారా..?

by Shyam |
చెరువులో తల్లీకూతుళ్ల శవాలు.. చనిపోయారా..? చంపేశారా..?
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో విషాదం చోటుచేసుకొంది. తిమ్మారెడ్డిపల్లి చెరువులో శనివారం ఉదయం తల్లీ కూతుళ్ళ మృతదేహాలను గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దామరగిద్ద మండలం వత్తు గుండ్ల తండాకు చెందిన రజిత(25), సంవత్సరం వయసున్న కూతురుతో కలిసి ఈ నెల 23న నారాయణపేటకు చేరింది. ఈ క్రమంలో ఆ రోజు సాయంత్రం వరకు తల్లీకూతుళ్ల ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నారాయణపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని తల్లీ కూతుళ్ళ ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే శనివారం ఉదయం చెరువులో తల్లీకూతుళ్లు శవాలుగా కనిపించడం సంచలనంగా మారింది. ఆ మృతదేహాలు నారాయణపేట లో తప్పిపోయిన రజిత, ఆమె కూతురు శ్రీలతవిగా గుర్తించారు. ఈ మేరకు ఉట్కూరు ఎస్ఐ రషీద్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇవి ఆత్మహత్యలా..? లేదా ఎవరైనా హత్య చేసి చెరువులో పారేశారా..? తల్లీకూతుళ్ల మృతికి గల కారణాలు ఏమిటి అన్న విషయాలతో పాటు వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

Next Story