ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం.. మొతేరా ముచ్చట్లు

by Shyam |
Motera Cricket Stadium
X

దిశ, స్పోర్ట్స్: ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన క్రికెట్ స్టేడియంలో రికార్డులకు ఎక్కిన అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియం మరో నాలుగు రోజుల్లో తొలి అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వబోతున్నది. 1.10 లక్షల మంది సామర్థ్యంతో నిర్మించిన ఈ స్టేడియం గత ఏడాది అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యక్రమం కోసం వినియోగించారు. ఆ తర్వాత కరోనా కారణంగా ఇండియాలో క్రికెట్ మ్యాచ్‌లు జరగకపోవడంతో మొతేరా స్టేడియం మూతబడింది. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చిన ఈ స్టేడియం చూసిన క్రికెటర్లు ఆశ్చర్యపోయారు.

Motera Stadium

మొతేరా క్రికెట్ కాంప్లెక్స్‌లో మొయిన్ గ్రౌండ్‌లో 11 పిచ్‌లు ఉన్నాయి. ఈ మెయిన్ గ్రౌండ్ పక్కనే మరో రెండు ప్రాక్టీస్ గ్రౌండ్స్ ఉన్నాయి. వీటిలో మరో 9 పిచ్‌లు ఉన్నాయి. అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంను 1983లో నిర్మించారు. తిరిగి 2006లో ఈ స్టేడియంను రెనొవేషన్ చేశారు. తాజాగా 2015లో ఈ స్టేడియం మొత్తాన్ని పడగొట్టి ప్రపంచంలో అతిపెద్ద స్టేడియంను 2020 ఫిబ్రవరిలో పూర్తి చేశారు. మొతేరా కంటే ముందు 90 వేల సామర్థ్యంతో ప్రపంచంలో అతిపెద్ద స్టేడియంగా రికార్డులకు ఎక్కింది. ఈ స్టేడియంలో 4 డ్రెస్సింగ్ రూమ్‌లతో పాటు 6 ఇండోర్ ప్రాక్టీస్ పిచ్‌లు ఉండటం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed