Amarinder Singh: బీజేపీలో కెప్టెన్ అమరీందర్ పార్టీ విలీనం..!

by S Gopi |   ( Updated:2 July 2022 9:10 AM  )
Amarinder Singh is said to be Joining BJP
X

చండీగఢ్: Amarinder Singh is said to be Joining BJP| పంజాబ్ మాజీ సీఎం, కాంగ్రెస్ మాజీ నేత అమరీందర్ సింగ్ బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఖరారైంది. కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకుని, వేరు పార్టీ పెట్టినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ మధ్యనే సర్జరీ చేయించుకుని లండన్ నుంచి వచ్చిన అమరీందర్ తన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేయనున్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే వారమే ఇది జరగనున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఐదు దశాబ్దాల పాటు సుదీర్ఘకాలం కాంగ్రెస్ కు సేవలు అందించిన ఆయన పార్టీలో జరిగిన కీలక పరిణామాలతో సీఎం పదవికి రాజీనామా చేయడంతో పాటు పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో కొత్త పార్టీని ఏర్పాటు చేసి, బీజేపీకి మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగారు. అయితే ఈ ఎన్నికల్లో కెప్టెన్ పాటియాలా నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆశ్చర్యకరంగా కాంగ్రెస్ కూడా దారుణ పరాజయం పాలై ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Next Story

Most Viewed