హెచ్1 బీ ఉద్యోగులకు వేతనాలు తగ్గించేశారట!

by Harish |
హెచ్1 బీ ఉద్యోగులకు వేతనాలు తగ్గించేశారట!
X

దిశ, వెబ్‌డెస్క్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెచ్చిన కొత్త వీసా సంస్కరణలకు తోడు కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఐటీ ఉద్యోగుల హెచ్1 బీ వీసాదారుల జీతాలకు సంబంధించి ఆశ్చర్యకరమైన అంశాలు తెలిశాయి. దిగ్గజ సంస్థలన్నీ మధ్యస్థ జీతాలను చెల్లించినట్టు ఇటీవల అందిన నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలోని టెక్నాలజీ కంప్నీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, ఆపిల్ సంస్థలతో పాటు అనేక దిగ్గజ సంస్థలన్నీ హెచ్1 బీ వీసాదారులకు మార్కెట్ విలువ కంటే తక్కువ వేతనాలు చెల్లించినట్టు నివేదిక స్పష్టం చేసింది.

అమెరికాలోని టాప్ 30 అమెరికన్ కంపెనీల్లో వాల్‌మార్ట్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, అమెజాన్, ఆపి, గూగుల్ సహా ప్రధాన సంస్థలు హెచ్1 బీ వీసాదారులను కలిగి ఉన్నాయి. వీరందరికీ స్థానికంగా ఉన్న సగటు కంటే తక్కువ వేతనాలను చెల్లించినట్టు తెలుస్తోంది. చట్టపరంగా ఉన్న ప్రోగ్రామ్ నిబంధనలను ఉపయోగించి స్థానిక జీతాల కంటే తక్కువ జీతాలను ఇచ్చినట్టు ఎకనామిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ ఇచ్చిన నివేదిక పేర్కొంది. ‘హెచ్1 బీ వీసాలు, ప్రస్తుత వేతన స్థాయి’ పేరుతో డెనియల్ కోస్టా, రాన్ హీరా ఇచ్చిన నివేదికలో..అమెరికా కార్మిక శాఖ(డీవోఎల్) ధృవీకరించిన 60 శాతం హెచ్1 బీ వీసాలున్న వారికి స్థానిక మిడ్ రేంజ్ జీతాల కంటే తక్కువ వేతన స్థాయిలో అందించాయి. అలాగే, నిబంధనలను మార్చే అధికారం డీవోఎల్‌కు ఉన్నప్పటికీ చేయకపోవడం గమనార్హం.

2019లో 53,000లకు పైగా సంస్థలు హెచ్1 బీ ప్రోగ్రామ్‌ను ఉపయోగించాయి. టాప్ 30 సంస్థల్లో సగానికి పైగా ఎక్కువమంది ఉద్యోగులను ఔట్ సోర్సింగ్ ద్వారానే నియమించుకుంటున్నాయని తెలుస్తోంది. టెక్ కంపెనీలి నేరుగా నియమించుకున్నప్పటికీ జీతాలు మాత్రం లెవెల్ 1, లెవెల్ 2 స్థాయిలోనే ఇస్తున్నట్టు నివేదిక పేర్కొంది.

Tags: H-1B Visa, What Is H-1B Visa, H-1B Employers, H-1B Employers In US, H-1B Workers, Facebook, Google, Apple, Microsoft, Amazon, Economic Policy Institute

Advertisement

Next Story

Most Viewed