నిరుద్యోగులకు శుభవార్త.. ఆ కంపెనీలలో ఉద్యోగాల వెల్లువ

by Harish |   ( Updated:2021-07-13 06:34:11.0  )
business
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఐటీ రంగంలో ఉద్యోగాల వెల్లువ భారీగా పెరిగింది. కొవిడ్ మహమ్మారి లాంటి సంక్షోభం సమయంలో దిగ్గజ కంపెనీలు, స్టార్టప్ కంపెనీలు సహా సర్వీస్ ప్రొవైడర్లు తక్షణమే టెక్ నిపుణులను నియమించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. చాలా కంపెనీల్లో డిజిటల్ వినియోగం పెరగడంతో ఐటీ సేవలకు డిమాండ్ అత్యధికంగా ఉందని, ప్రధాన ఐటీ సంస్థలు వేలల్లో ఐటీ ఉద్యోగులను ఆహ్వానిస్తున్నాయి. ఆయా ఉద్యోగులకు అర్హతను బట్టి అత్యధిక వేతనాలను కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా డేటా ఇంజనీర్లు, యాప్ డెవలపర్, ఫుల్‌స్టాక్ డెవలపర్స్, బ్యాక్ ఎండ్ ఇంజనీర్, మెషీన్ లెర్నింగ్ సేవల్లో భారీగా ఉద్యోగాలకు అవకాశాలు పెరిగాయి.

ప్రస్తుత డిమాండ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఐటీ కంపెనీలు కొత్త ఉద్యోగులకు గతేడాది ఉన్న వేతనానికి అదనంగా 25 శాతం ఎక్కువే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ కారణంగానే గడిచిన కొన్ని నెలలుగా ఐటీ రంగంలో ఉద్యోగావకాశాలు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. ఐటీ రంగ నిపుణులు ప్రకారం.. దేశంలో సుమారు 70 వేల మంది ఐటీ నిపుణుల అవసరం ఉంది. కొన్ని విభాగాల్లో ఉద్యోగులకు 50 శాతం కంటే ఎక్కువ వేతనాన్ని కూడా ఇచ్చి నియమించుకుంటున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ టెక్ కంపెనీల్లో ఒకటైన యాక్సెంచర్ గతేడాది 3 వేల మందిని ఐటీ నిపుణులను చేర్చుకోగా, ఈ ఏడాది దాదాపు 30 వేల మంది అవసరం ఉందని తెలిపింది. కాగ్నిజెంట్ 35 వేల మంది వరకు నియమించుకోనుంది.

Advertisement

Next Story

Most Viewed