- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
900 ఏళ్ల క్రితం మూన్ మాయం.. కారణం?
చంద్రుడు స్థిరం. వాతావరణం బాగోలేకపోతే, అమావాస్య రోజు తప్ప ప్రతీరోజు రాత్రి మనకు కనిపిస్తాడు. కానీ 900 ఏళ్ల క్రితం అంటే సరిగ్గా 1100 సంవత్సరంలో చంద్రుడు కనిపించకుండా మాయమయ్యాడని అప్పటి శాస్త్రవేత్తలు తమ పుస్తకాల్లో రాశారు. అయితే దీనికి కారణాలు ఏంటో అప్పుడు కనిపెట్టలేకపోయారు. కానీ, ఇప్పుడు సాంకేతికత పెరిగింది కదా.. మొత్తానికి కారణం తెలుసుకోగలిగారు.
ఆనాడు పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని ఆంగ్లో శాక్సన్ పీటర్‌బరో క్రానికల్‌లో రాసిన దాన్ని బట్టి శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మే నెలలో ఐదో రోజు రాత్రి పూట వెన్నెల కొద్దికొద్దిగా కనిపించకుండా పోయిందని, తర్వాత మరుసటి రోజు దేదీప్యమానంగా వెలుగుతూ కనిపించిందని అందులో రాసి ఉంది. తాము చూస్తుండగానే చంద్రుడు మాయమయ్యాడని అందులో ప్రస్తావించారు. దీన్ని ఛాలెంజ్‌గా తీసుకుని పరిశోధించిన శాస్త్రవేత్తలు అందుకు గల కారణాన్ని కనిపెట్టారు. ఆరోజుల్లో అగ్నిపర్వతాలు చాలా క్రియాశీలకంగా ఉండేవని, వాటి నుంచి విడుదలైన దుమ్ము, బూడిద కారణంగా చంద్రుడు నెమ్మదిగా మాయమైనట్లు కనిపించిందని తేల్చిచెప్పారు. అంతే తప్ప చంద్రుడు నిజంగా మాయం కాలేదని చెబుతూ సైంటిఫిక్ రిపోర్ట్స్ మేగజైన్‌లో ఒక వ్యాసం ప్రచురితమైంది.