రాజధానిలో ఫుల్లు వర్షం.. ఇవాళ కూడా..

by Anukaran |
రాజధానిలో ఫుల్లు వర్షం.. ఇవాళ కూడా..
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో గత కొద్ది రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం గోహానా, గనౌర్, బరూత్, సోనిపట్, ఆదంపూర్, ఫరిదాబాద్, హిస్సార్, బాగ్ పాట్, నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్ ప్రాంతాల్లో వర్షం పడింది. సుమారు గంటపాటు ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో అక్కడ రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరో రెండు రోజులపాటు కూడా అక్కడ వర్షాలు కురువనున్నాయి. ఈ విషయాన్ని వాతావరణ శాఖ వెల్లడించింది. చండీగఢ్ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

Advertisement

Next Story