- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీరంగం సృష్టిస్తున్న కోతులు.. అక్కడి ప్రజలను వదలట్లేదు
దిశ,నిర్మల్ కల్చరల్: నిర్మల్ జిల్లాకేంద్రంతో పాటు చుట్టూ ఉన్న మండలాల్లోని ఆయా గ్రామాల్లో వానరాల బెడద తీవ్రతరమైంది. ఒకేసారి గుంపులు గుంపులుగా వచ్చి ఇళ్లలో, వ్యాపార సముదాయాలు, షాపులలో దాడి చేస్తున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మహిళలు, చిన్నపిల్లలపై దాడిచేసి వారి చేతిలో ఉన్న వస్తువులను ఎత్తుకెళ్తున్న ఘటనలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. ఇటీవల నిర్మల్ పట్టణ కేంద్రంలోని శాంతినగర్, హౌసింగ్ బోర్డు కాలనీలలో కోతులమూక కిరాణా షాపులో దూరి వస్తువులను ఎత్తుకెళ్లడమేగాక పెద్దమొత్తంలో నష్టపరిచాయి. ఇక పట్టణంలోని గుడులవద్ద, పండ్లూ, కూరగాయలు అమ్మేచోట బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థితులు నెలకొన్నాయి.
నిర్మల్ పరిసర ప్రాంత గ్రామాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. పాఠశాలకు వెళ్లే చిన్నారులపై దాడిచేసి గాయపరిచిన ఘటనలు కూడా జరుగుతున్నాయి. పట్టణంలోని ప్రియదర్శినినగర్‌లో ఇటీవల వడియాలు ఆరబెట్టుటకు డాబా పైకి ఎక్కిన ఓ మహిళపై కోతులు దాడిచేయగా పరుగెత్తుకుంటూ కిందకు దిగేక్రమంలో మెట్లపై నుండి జారిపడి కాలు, చెయ్యి విరిగింది. ఇక పండ్లు కొనుక్కుని నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువకుడిని అనుసరించిన వానరమూక దాడిచేసి గాయపరుచగా తగిన చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కోతులు గుంపులుగా వ్యవసాయపంట పొలాల మీద ఎగబడి మొక్కజొన్న, కూరగాయలు వంటివాటిని తీవ్రంగా నష్టపరుస్తున్నాయి.
కోతుల సంతాననియంత్రణ కేంద్రం ఏర్పాటైనా…
నిర్మల్ జిల్లాకేంద్రం సమీపంలోని హరితవనంలో కోతుల సంతానోత్పత్తి నియంత్రణ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పింది. బోను ద్వారా కోతులనుపట్టి వాటికి సంతాన నియంత్రణ శస్త్రచికిత్సలు చేసి వదిలిపెట్టాలన్న ఉద్దేశంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. అయినా పూర్తిస్థాయిలో ప్రయోజనం ఉండటం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా వానరాల బారినుండి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు.
కోతుల సమూహాలనుండి ముప్పు పొంచిఉంది.
కాలనీలో కోతులు విపరీతంగా పెరిగిపోయాయి. రోడ్డుమీద వెళ్లేవారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. చేతిలో ఉన్న వస్తువులను లాక్కెళ్లిపోతున్నాయి. ప్రతిఘటిస్తే మీదపడి గాయపరుస్తున్నాయి. ప్రభుత్వాధికారులే వీటి బెడదనుండి రక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
– గంధం రత్నాకర్,బాలాజీవాడ,నిర్మల్