ముంపు బాధితుల‌కు ప‌రిహారం చెల్లించాలి

by Shyam |   ( Updated:2020-04-07 08:20:47.0  )
ముంపు బాధితుల‌కు ప‌రిహారం చెల్లించాలి
X

దిశ, న‌ల్ల‌గొండ‌ :ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైనింగ్‌లో భాగంగా కాళేశ్వ‌రం 16వ ప్యాకేజీ కింద‌ భువ‌న‌గిరి మండ‌లం బ‌స్వాపురంలో నిర్మిస్తున్న రిజర్వాయర్ ముంపు బాధితులకు పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ యాదాద్రి జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం బస్వాపురం రిజర్వాయర్ వద్దకు చేరుకుని, ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. స్థానిక ముంపు బాధిత రైతులకు చెల్లించిన నష్టపరిహారం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 0.08 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టును టీఆర్ఎస్ ప్రభుత్వం రీడిజైనింగ్‌లో భాగంగా 11.39 టీఎంసీల సామర్థ్యానికి పెంచ‌డం వ‌ల్ల‌ ఎక్కువ మొత్తంలో ముంపుకు గురవుతుందన్నారు. ప్రభుత్వం అధిక నిధులను ప్రాజెక్టు నిర్మాణాలకు కేటాయిస్తూ, స్థానికులకు న్యాయం చేయకపోవటం దురదృష్టకరమన్నారు. భూములు కోల్పోయిన రైతులకు మార్కెట్ ధర ప్రకారం నష్ట పరిహారం చెల్లించి, ఇళ్ల స్థలాలతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. లేనియెడల ముంపు బాధితుల తరఫున పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్నిహెచ్చరించారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి చిక్కుల వెంకటేశం, పొ త్నక్ ప్రమోద్ కుమార్, మచ్చ మల్లేశం, మచ్చ పాండు, చెరుకుల పాండు, రమేష్, బాలస్వామి, కడారి చందు, రాజు, స్వామి, భాస్కర్ పాల్గొన్నారు.

Tags: baswapuram reserwaior, fund to people, kaleshwaram, congress leader anil

Advertisement

Next Story

Most Viewed