- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాబ్ కావాలా.. ఎంపీ కవిత పీఏను అంటూ మనీ వసూల్..
దిశ, మహబూబాబాద్ : మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోత్ కవిత పీఏను అంటూ.. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ నిరుద్యోగి నుంచి డబ్బులు వసూల్ చేశాడు ఓ ఛీటర్. అయితే ఈ విషయం కాస్తా ఎంపీ కవిత పర్సనల్ సెక్రటరీ రాజాబాబుకు తెలియడంతో వారు.. గురువారం మహబూబాబాద్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై సీఐ వెంకతరత్నం తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ మండలంలోని అమన్‌గల్ గ్రామానికి చెందిన పెద్దపులి వెంకన్న అనే వ్యక్తి కొద్ది నెలల క్రితం మిర్యాలగూడకు చెందిన బీమా నాయక్‌ను పరిచయం చేసుకున్నాడు. వెంకన్న.. ఎంపీ కవిత దగ్గర పీఏగా పనిచేస్తున్నానని చెప్పి.. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి నాయక్ వద్ద రూ. 80 వేలు వసూలు చేసినట్లు తెలిపారు.
నెలలు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో, గురువారం ఎంపీ కవితకు బీమా నాయక్ ఫోన్ చేసి.. నేను మీ పీఏ వెంకన్నకు డబ్బులు ఇచ్చానని మెసేజ్ చేయగా అసలు విషయం బయటకు వచ్చింది. కాగా ఈ విషయంపై ఎంపీ కవిత పీఏ రాజాబాబు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.