20నిమిషాల్లోనే కరోనా గుర్తింపు..

by vinod kumar |
20నిమిషాల్లోనే కరోనా గుర్తింపు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇకమీదట ఓ వ్యక్తికి కరోనా సోకిందా లేదా అనేది అతితక్కువ సమయంలోనే తెలిసిపోనుంది. ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ పరిశోధకులు 20 నిమిషాల వ్యవధిలో కరోనాను నిర్ధారించే కొత్తరకం బ్లడ్ టెస్ట్‌ను అభివృద్ధి చేశారు. ఈ పరీక్ష ద్వారా కరోనా సోకినవారినే కాకుండా కరోనా బారినపడి కోలుకున్నవారిని సైతం గుర్తించవచ్చునని తెలిపారు. అలాగే వ్యాక్సిన్ పరీక్షల్లో అవసరమైన యాంటీబాడీల వృద్ధిని కూడా ఈ పరీక్షల ద్వారా త్వరగా తెలుసుకోవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు.

ఇటీవల పరిశోధకులు 25 మైక్రోలీటర్ల ప్లాస్మాను ఉపయోగించి కోవిడ్ 19 కేసులను గుర్తించినట్లు వర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా పాజిటివ్ కేసులు ఎర్ర రక్త కణాల క్లస్టరింగ్‌కు కారణమవుతాయి. ఇక దీనిని కంటితో సులభంగా గుర్తించవచ్చు. పరిశోధకులు కేవలం 20 నిమిషాల్లోనే పాజిటివ్, నెగెటివ్ రీడింగ్స్ పొందవచ్చునని మోనాష్ యూనివర్సిటీ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed