- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాధాకరమైన విషయం.. 'మా' ఎన్నికలపై మోహన్ బాబు ఆవేదన
దిశ, వెబ్‌డెస్క్: ‘మా’ ఎన్నికల రాజకీయంతో టాలీవుడ్ హీటెక్కుతోంది. నటీనటుల మధ్య మాటల యుద్ధంతో రాజకీయ ఎన్నికలను తలపించేలా మా ఎన్నికలు కాక రేపుతున్నాయి. ప్రకాష్ రాజ్‌కు మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేయడం, తన కుమారుడు మంచు విష్ణుకు ఓటేయాలని మోహన్ బాబు కోరుతుండటంతో.. మెగా ఫ్యామిలీ వర్సెస్ మంచు ఫ్యామిలీగా ‘మా’ ఎన్నికలు మారాయి. మోహన్ బాబుపై నాగబాబు విమర్శలు చేయడం, మంచు విష్ణు వర్గం కౌంటర్లు ఇవ్వడం హాట్‌టాపిక్‌గా మారాయి.
ఈ క్రమంలో తాజాగా ‘మా’ ఎన్నికల రాజకీయంపై మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. మంచు విష్ణుకు ఓటేయాలని కోరిన మోహన్ బాబు.. మా అధ్యక్షుడ్ని ఏకగ్రీవం చేయాలని గతంలో పెద్దలంతా కోరుకున్నారని, కానీ ఇప్పుడు కొంతమంది బజారుకెక్కి పరువు తీస్తున్నారని ఆవేదన చెందారు. ఇది చాలా బాధాకరమైన విషయమని, మనస్సాక్షి ప్రకారం ఎవరు మంచి వారో వారికే ఓటు వేయాలని మోహన్ బాబు పిలుపునిచ్చారు.
‘మా ఎన్నికల పరిస్థితి చూస్తే మనసుకు కష్టంగా ఉంది. ఎవరు ఏం చేసినా మా అనేది ఒక కుటుంబం. విష్ణు మీ కుటుంబసభ్యుడు. విష్ణు గెలిచాక రెండు రాష్ట్రాల సీఎంలను కలుస్తాం. సినీ పరిశ్రమ కష్టాలను సీఎంలకు చెప్పుకుందాం. మేనిఫెస్టోలోని హామీని విష్ణు నెరవేరుస్తాడనే నమ్మకం ఉంది’ అని మోహన్ బాబు పేర్కొన్నారు.