‘పెదరాయుడు’ తర్వాత 26 ఏళ్లకు కొడుకు సినిమా

by Shyam |
‘పెదరాయుడు’ తర్వాత 26 ఏళ్లకు కొడుకు సినిమా
X

దిశ, సినిమా : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినిమాల గురించి చెప్పాల్సిన పనిలేదు. విలన్‌గా, హీరోగా పవర్‌ఫుల్ పాత్రలు పోషించిన ఆయన.. సెపరేట్ డిక్షన్‌తో డైలాగులు పేల్చడంలో దిట్ట. ఇక తన నలభై ఏళ్ల సినీ ప్రస్థానంలో ‘పెదరాయుడు’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉండగా.. ఈ సినిమాతో పాటు తన లేటెస్ట్ మూవీ ‘సన్ ఆఫ్ ఇండియా’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు బాబు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై తను నటిస్తూ, నిర్మించిన పెదరాయుడు చిత్రాన్ని 1995 జూన్ 15న తెలుగు ఇండస్ట్రీకి 65 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రిలీజ్ చేసినట్టు తెలిపిన ఈ అసెంబ్లీ రౌడీ.. పెదరాయుడు రిలీజైన 26 ఏళ్లకు అంటే 2021 జూన్ 21న తన లేటెస్ట్ మూవీ ‘సన్ ఆఫ్ ఇండియా’ చిత్ర లిరికల్ వీడియో విడుదల కావడం శుభపరిణామం అని పేర్కొన్నారు.

అంతేకాదు అప్పుడు పెదరాయుడు చిత్రానికి తను నిర్మాత కాగా, ఇప్పుడు ‘సన్ ఆఫ్ ఇండియా’కు కుమారుడు విష్ణువర్ధన్ బాబు నిర్మాత కావడం సంతోషదాయకమని అన్నారు. ఈ సందర్భంగా తాజా చిత్రానికి సంబంధించిన 11వ శతాబ్దపు రఘువీర గద్యాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యంలో రాహుల్ నంబియార్ ఆలపించిన ఈ లిరికల్ వీడియోను ‘మర్యాద పురుషోత్తముడైన శ్రీరామునికి అంకితం ఇస్తున్నాను’ అని వెల్లడించారు.

Advertisement

Next Story