- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హఫీజ్ అత్యుత్సాహం.. పీసీబీ ఆగ్రహం
దిశ, స్పోర్ట్స్: ఆల్ రౌండర్ మహ్మద్ హఫీజ్ అత్యుత్సాహం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు ఆగ్రహం తెప్పించింది. వ్యక్తిగతంగా కరోనా టెస్టు చేయించుకున్న హఫీజ్, ఆ ఫలితాల రిపోర్ట్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. 31 మంది సభ్యులతో కూడిన పాక్ జట్టు ఆదివారం ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్‌కు వెళ్లింది. అంతకుముందు గత సోమవారం ఆటగాళ్లందరికీ కరోనా టెస్టులు నిర్వహించగా, 10 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ తర్వాతి రోజు మహ్మద్ హఫీజ్ తన కుటుంబ సభ్యులతో కలసి వ్యక్తిగతంగా పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ అని తేలింది. ఆ విషయాన్ని అతను ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. దీంతో భయాందోళన చెందిన మిగిలిన 9మంది క్రికెటర్లు తమకు మరోసారి కరోనా పరీక్షలు చేయాలని బోర్డును కోరారు. తిరిగి 10 మంది క్రికెటర్లకు పీసీబీ కరోనా పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్ అని తేలింది. వారిలో హఫీజ్ కూడా ఉన్నాడు. ఈ విషయమై అందరూ హఫీజ్‌పై మండిపడుతున్నారు. అనుమతి లేకుండా వ్యక్తిగతంగా పరీక్షలు చేయించుకోవడమే కాకుండా, ఆ ఫలితాలను సామాజిక మాధ్యమాల్లో పెట్టడంపై పీసీబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం ఇంగ్లండ్ వెళ్లిన పాక్ జట్టుతో ఈ 10 మంది క్రికెటర్లను పంపలేదు. మరో రెండుసార్లు పరీక్షలు నిర్వహించి, ఫలితం నెగెటివ్ వస్తేనే ఇంగ్లండ్ పంపుతామని పీసీబీ స్పష్టం చేసింది.