- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతర్జాతీయ క్రికెట్‌కు అతడు వీడ్కోలు
దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్ స్టార్ పేసర్ మహ్మద్ అమిర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. పాకిస్తాన్ ఆడబోయే భవిష్యత్ అంతర్జాతీయ మ్యాచ్‌లకు తనను పరిగణలోకి తీసుకోవద్దని బోర్డుకు చెప్పాడని.. అమిర్ఇకపై అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటాడని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సీఈవో వాసిమ్ ఖాన్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కేవలం 17 ఏళ్ల వయసులో నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడాడు. అతడు ఆడిన తొలి సీజన్‌లోనే 55 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. 2009 టీ20 వరల్డ్ కప్ జట్టుకు ఎంపికయ్యి తన అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించాడు. ఫైనల్స్‌లో శ్రీలంకపై అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేయడంతో పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ గెలిచింది. తన కెరీర్‌లో 30 టెస్టులు, 61 వన్డేలు, 50 టీ20లు ఆడిన అమిర్ మొత్తం 259 వికెట్లు తీసుకున్నాడు. బుధవారం ముగిసిన లంక ప్రీమియర్ లీగ్‌లో గాలే గ్లాడియేటర్స్ తరపున ఆడాడు. గత ఏడాది జులైలో టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మహ్మద్ అమిర్ తాజాగా వైట్ బాల్ క్రికెట్‌కు కూడా వీడ్కోలు చెప్పాడు.