- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
టెస్టు క్రికెట్‌కు మొయిన్ అలీ వీడ్కోలు
దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ మొయిన్ అలీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇకపై సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడబోనని.. కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడతానని మొయిన్ అలీ పేర్కొన్నాడు. ముందుగా టెస్టు జట్టు కెప్టెన్ జో రూట్, హెడ్‌కోచ్ క్రిస్ స్విల్వర్‌వుడ్‌లను సంప్రదించి తన నిర్ణయాన్ని తెలియజేశాడు. మొయిన్ అలీ నిర్ణయాన్ని వాళ్లు స్వాగతించి విషయాన్ని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుకు తెలియజేశారు. దీంతో ఈసీబీ సోమవారం మొయిన్ అలీ రిటైర్మెంట్ ప్రకటన విడుదల చేసింది.
ఇంగ్లాండ్ తరపున 64 టెస్టులు ఆడిన అలీ 2914 పరుగులు చేసి.. 195 వికెట్లు తీశాడు. ఇందులో 5 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో అలీ అత్యధిక స్కోర్ 155 పరుగులు. ‘ఇప్పుడు నా వయసు 34 ఏళ్లు. మరి కొంత కాలం క్రికెట్ ఆడాలని భావిస్తున్నాను. అందుకే సుదీర్ఘ ఫార్మాట్‌కు గుడ్ బై చెబుతున్నాను. టెస్టు క్రికెట్ చాలా అద్భుతమైనది. కానీ ఈ వయసులో నేను ఆ ఫార్మాట్ ఆడలేనని అనుకుంటున్నాను. ఇకపై నా సహచరులతో కలసి వైట్ జెర్సీలో మైదానంలోకి అడుగుపెట్టలేను. నా క్రికెట్ జర్నీలో సహకరించిన అందరికీ, కుటుంబ సభ్యలకు, నా కోచ్‌లకు ధన్యవాదములు’ అని మొయిన్ అలీ పేర్కొన్నాడు.
- Tags
- moeen ali