- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తప్పుడు సమాచారాన్ని అడ్డుకోవాలి: మోదీ
న్యూఢిల్లీ: కరోనా నేడు విలయం సృష్టిస్తు్న్నదని, ఆప్తుల ప్రాణాలు చూస్తుండగా గాలిలో కలుస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో అన్నారు. మహమ్మారి రెండో వేవ్ మన విశ్వాసాన్ని, బలాన్ని పరీక్షిస్తున్నదని తెలిపారు. తొలి వేవ్‌పై విజయవంతంగా ప్రజలందరూ పోరాడారని, దేశమంతా ఒక బలమైన నమ్మకం, ఆత్మవిశ్వాసం పెరిగిందని వివరించారు. కానీ, హఠాత్తుగా సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేస్తున్నదని చెప్పారు. అందరు కచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటించాలని, అర్హులందరూ వీలైనంత త్వరగా టీకా తీసుకోవాలని సూచించారు. ఔషదాలు, జాగ్రత్తలూ అనే మంత్రాన్ని సదా ఆచరించాలని, తద్వారా తప్పకుండా ఈ మహమ్మారిని జయించి తీరుతామని అన్నారు. తాను నిపుణులు, వైద్యులు, ఫార్మా రంగ ఎక్స్‌పర్టులతో ఇటీవల చాలా సమావేశాలు నిర్వహించానని, కరోనా నష్టాన్ని తగ్గించడానికి శక్తివంచన లేకుండా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని వివరించారు. కరోనా పోరాటంలో రాష్ట్రాలకు బలమైన అండగా కేంద్రం ఉంటుందని, ఈ పోరాటంలో గెలవడానికి అన్ని రకాల సహకరిస్తుందని భరోసానిచ్చారు.
గత ఏడాది నేర్పిన పాఠాలతో ప్రజల్లో నేడు అవగాహన పెరిగిందని, గ్రామీణ ప్రాంతాల్లోనూ జాగృతంగా వ్యవహరిస్తు్న్నారని ప్రధాని అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఒకరికొకరు సహకరించుకుంటున్నారని వివరించారు. ఇది హర్షనీయమని తెలిపారు. దేశ ప్రజలు కరోనాపై పోరుకు మరోసారి ఏకమయ్యారని వివరించారు. అయితే, టీకాలపై కొందరు తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని అన్నారు. ప్రజలంతా దయచేసి విశ్వసనీయమైన వర్గాల సూచనలనే నమ్మాలని తెలిపారు. తప్పుడు వార్తలనూ పట్టించుకోవద్దని చెప్పారు. టీకా సామర్థ్యంపై అపోహలు వద్దని, ఇప్పటికే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా టీకాలు పంపిణీ చేయడం ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందేనని వివరించారు. కరోనా సంకట పరిస్థితుల నిర్వహించిన మన్ కీ బాత్ తాజా ఎడిషన్‌ను పూర్తిగా మహమ్మారిపైనే మాట్లాడటానికి నిర్ణయించినట్టు తెలిపారు. ఈ ఎడిషన్‌లో చాలా వరకు వైద్యులతో ప్రధాని మాట్లాడారు. సలహాలు, సూచనలను అడిగారు.