మరో రికార్డు సొంతం చేసుకోబోతున్న మోడీ..

by Anukaran |   ( Updated:2021-08-01 21:42:56.0  )
మరో రికార్డు సొంతం చేసుకోబోతున్న మోడీ..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ మరో రికార్డు సొంతం చేసుకోబోతున్నారు. ఆగస్టు 9న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి మోడీ అధ్యక్షత వహించనున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఈ ఘనత అందుకున్న తొలి ప్రధానిగా మోడీ చరిత్ర సృష్టించనున్నారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి మాజీ రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ వెల్లడించారు. వర్చువల్‌గా జరుగనున్న ఈ కార్యక్రమంలో శాంతి స్థాపన, ఉగ్రవాద నిర్మూళన, వ్యాక్సినేషన్ లాంటి అంశాలపై మోడీ మాట్లాడనున్నారు.

Advertisement

Next Story