ఈ హింసా చర్యలు నిన్ను కాపాడలేవు.. దీదీపై మోడీ ఫైర్

by Shamantha N |   ( Updated:2021-04-10 03:40:22.0  )
ఈ హింసా చర్యలు నిన్ను కాపాడలేవు.. దీదీపై మోడీ ఫైర్
X

కోల్‌కత: బెంగాల్‌లోని కూచ్‌బీహార్‌లో సీఐఎస్ఎఫ్ కాల్పుల్లో నలుగురు టీఎంసీ కార్యకర్తలు మృతి చెందడం బాధాకరమైన విషయమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. బెంగాల్‌లో శనివారం జరిగిన ఘటనలపై సిలిగురి బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ.. ‘బెంగాల్‌లో బీజేపీకి ప్రజల నుంచి మద్దతు పెరుగుతుండటంతో దీదీ, ఆమె పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అందుకే భద్రతా బలగాలను రెచ్చగొట్టి ఎన్నికలను ప్రక్రియకు విఘాతం కలిగించేందుకు టీఎంసీ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారని అన్నారు.

బెంగాల్‌లో త్వరలో దీదీ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయం. అందుకే దీదీ ఈ స్థాయికి దిగజారుతున్నారు. దీదీ.. ఈ హింస, భద్రతా బలగాలపై దాడులు చేసేలా ప్రజలను రెచ్చగొట్టడం తద్వారా ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించడం లాంటి చర్యలు నిన్ను కాపాడలేవు. పదేండ్లుగా నీవు చేస్తున్న దుశ్చర్యల నుంచి ఇలాంటి హింసలు నిన్ను రక్షించలేవు. కాగా కూచ్‌బీహార్‌లో జరిగిన ఘటన విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఎన్నికల సంఘాన్ని ఆయన కోరారు.

Advertisement

Next Story

Most Viewed