పిల్లల్లో మొడెర్నా టీకా సత్ఫలితాలు

by vinod kumar |
పిల్లల్లో మొడెర్నా టీకా సత్ఫలితాలు
X

వాషింగ్టన్: భారత్ సహా చాలా దేశాలు వయోజనులకు టీకా వేయడానికి తీవ్ర కసరత్తు చేస్తుండగా అమెరికా మరొక అడుగు ముందుకేసి 12ఏళ్లు పైబడిన బాలబాలికలకు వ్యాక్సినేషన్ ప్రారంభించింది. ఈ దేశంలో ఫైజర్ టీకా 12ఏళ్లు పైబడినవారు వేసుకోవడానికి అనుమతి ఉన్నది. తాజాగా, అదే దారిలో మొడెర్నా కూడా వెళ్లనున్నట్టు సంకేతాలిచ్చింది. 12 ఏళ్లు పైబడిన పిల్లల్లో తమ టీకా సత్ఫలితాలిస్తున్నదని మంగళవారం ప్రకటించింది. 12 నుంచి 17ఏళ్ల వయసున్న 3,700 మంది చిన్నారులపై తమ టీకా ప్రయోగాలు చేశామని, ఇందులో టీకా 93శాతం సమర్థవంతమైనదిగా తేలిందని వివరించింది. తలనొప్పి, నీరసం, చేతి నొప్పులే సాధారణమైన తాత్కాలిక సైడ్ ఎఫెక్టులు వస్తున్నాయని పేర్కొంది. త్వరలోనే తాము టీన్ డేటా సమర్పించి అమెరికా ఫుడ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటామని వివరించింది. వచ్చే నెల తొలినాళ్లలో ఇతర దేశాల రెగ్యులేటరీ అనుమతి కోరుతామని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed