ఫారెస్ట్ అధికారులకు సిగ్గుండాలి: రాజాసింగ్

by Shyam |
ఫారెస్ట్ అధికారులకు సిగ్గుండాలి: రాజాసింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: అటవీశాఖ అధికారులకు సిగ్గు ఉండాలని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొమురం భీమ్ అడవుల్లో పులి సంచరిస్తుందని గుర్తు చేసిన రాజాసింగ్.. పులిని పట్టుకోవడం కోసం గోమాతను బలిచేయడం దారుణమన్నారు. ఇంత టెక్నాలజీ ఉన్న తర్వాత కూడా ఆవులను కట్టి పులిని పట్టుకోవాలని అధికారులు ప్రయత్నాలు చేయడాన్ని ఖండిస్తున్నానని చెప్పారు. డ్రోన్ కెమెరాల సహాయంతో గుర్తించాల్సింది పోయి ఇలా గోమాతను అడ్డుగా పెట్టడంపై రాజాసింగ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలకు దిగుతున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed