రైతులకు రూ. 500 బోనస్ ఇవ్వాలి: ఎమ్మెల్సీ రామచంద్ర రావు

by Shyam |   ( Updated:2020-04-21 13:26:04.0  )

దిశ, నల్లగొండ: లాక్‌డౌన్ నేపథ్యంలో రైతాంగానికి రూ. 500 బోనస్ అందించాలని ఎమ్మెల్సీ ఎన్ రామచందర్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భాగంగా యాదాద్రి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో ఐకేపీ కేంద్రాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో హమాలీ కూలీల సంఖ్యను పెంచి, గన్ని బ్యాగుల కొరతను నివారించాలన్నారు. అలాగే ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం నిల్వ లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రైతాంగానికి సంబంధించిన వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకుండా వారికి అన్ని సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గోలి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దాసరి మల్లేశం, కార్యవర్గ సభ్యులు పోతంశెట్టి రవీందర్, జిల్లా ఉపాధ్యక్షులు నకిరేకంటి మొగులయ్య, జిల్లా కార్యదర్శి కన్నెగంటి వెంకటేశ్వర చారి తదితరులు పాల్గొన్నారు.
tags ; corona, lock down, rs.500 benefit, announce to farmers, mlc ramchandra rao

Advertisement

Next Story

Most Viewed