పోలీసు వలంటీర్ల‌కు టీషర్ట్స్

by Shyam |   ( Updated:2020-04-01 07:37:14.0  )
పోలీసు వలంటీర్ల‌కు టీషర్ట్స్
X

దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా అమనగల్లు పోలీసు స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ నర్సింహారెడ్డి, ఎస్సై ధర్మేశ్‎లతో కలిసి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి పోలీస్ వాలంటీర్స్ టీషర్ట్‌లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ కోసం రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిందని గుర్తు చేశారు. ఈ కరోనా కర్ఫ్యూలో రాష్ట్ర పోలీసు అధికారులు చాలా జాగ్రత్తగా వ్యహరిస్తున్నారని తెలిపారు. అందుకోసం పోలీసు అధికారులతో పాటు తోడుగా కొంతమంది పోలీసు వాలంటిర్స్ కూడా అవసరమని తెలిపారు. ఈ నేపథ్యంలోనే పోలీస్ వాలంటీర్లను నియమిస్తున్నామని చెప్పారు. వాలంటీర్స్ విధుల్లో ఉండేవారు ప్రజలను బయటికి రాకుండా చూసుకోవాలని ఎమ్మెల్సీ నారాయణరెడ్డి సూచించారు.

Tags: MLC narayanareddy, distributed, T-shirts, police volunteers, rangareddy

Advertisement

Next Story