- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దీక్షా దివస్ స్పూర్తితో రాష్ట్ర ప్రగతికి పునరంకితమవుతాం
దిశ, వెబ్డెస్క్: కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు నేటితో పదకొండేళ్లు పూర్తయ్యాయని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 29 నవంబర్, 2009న కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారన్నారు. యావత్ తెలంగాణ ప్రజలను ఏకం చేసి, ఢిల్లీ పునాదులను కదిలించిన దీక్షా దివస్ స్ఫూర్తితో తెలంగాణ ప్రగతికి పునరంకితమై కేసీఆర్‌కు అండగా ఉండాలని ట్వీట్ చేశారు.
యావత్ తెలంగాణ ప్రజలను ఏకం చేసి, ఢిల్లీ పునాదులను కదిలించిన దీక్షా దివస్ స్పూర్తితో తెలంగాణ ప్రగతికి పునరంకితమవుదాం. కేసిఆర్ గారికి అండగా ఉందాం
జై కేసీఆర్! జై తెలంగాణ!!#DeekshaDivas #TelanganaWithKCR pic.twitter.com/kIss7ado2K— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 29, 2020