- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా – ఎమ్మెల్సీ కవిత
దిశ ప్రతినిధి , హైదరాబాద్: రాష్ట్రంలోని ఎయిడెడ్ కళాశాలల్లో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కరించేందుకు చూస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ప్రభుత్వ కళాశాలలకు బదిలీ అయిన సిబ్బంది, అధ్యాపకులు పడుతున్న ఇబ్బందులను తెలంగాణ ఎయిడెడ్ కాలేజ్ స్టాప్ అసోసియేషన్ అధ్యక్షుడు ధరణికోట వెంకటరమణ ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ఎయిడెడ్ కళాశాలలో కారుణ్య నియామకాలు నిలిచిపోవడంతో, చనిపోయిన సిబ్బంది కుటుంబ సభ్యులు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్సీ కవితకు వివరించారు.
హెల్త్ కార్డ్స్ లేకపోవటం, ఆరోగ్య బీమా లేకపోవడం ఇబ్బందులకు గురిచేస్తోందని, కళాశాలల్లో పనిభారం లేని సిబ్బందిని, లెక్చరర్లను ప్రభుత్వ కళాశాలలకు బదిలీ చేయాలని, దీనివల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థికభారం ఉండదని, ఎయిడెడ్ కళాశాలల సిబ్బందిని ప్రభుత్వ కళాశాలలో విలీనం చేయటం సముచితంగా ఉంటుందని చెప్పారు. దీనికి ఎమ్మెల్సీ కవిత సానుకూలంగా స్పందించారని, త్వరలో సమస్యలు పరిష్కారమౌతాయని వెంకటరమణ ఆశాభావం వ్యక్తం చేశారు . ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యనిర్వహక అధ్యక్షుడు జె.ప్రభాకర్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బి.లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి ఆర్. కృష్ణయ్య, భూపాల్ రెడ్డి,కిషోర్,మూర్తి తదితరులున్నారు.