నాకు ఎవరి అనుమతి అవసరం లేదు: కడియం

by Shyam |   ( Updated:2020-05-11 09:41:20.0  )
నాకు ఎవరి అనుమతి అవసరం లేదు: కడియం
X

దిశ, వరంగల్: ఇటీవల ఎమ్మెల్యే టి. రాజయ్య చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తనదైన శైలిలో స్పందించారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చేసిన ఆసక్తికర వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికి ‘నేనే రాజు, నేనే మంత్రి, ఇక్కడికి రావాలంటే నా అనుమతి తీసుకోవాలి.’ అంటూ రాజయ్య వ్యాఖ్యనించడంతో రాజకీయంగా దుమారం రేగింది. దీనిపై ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఈ విధంగా స్పందించారు. ‘‘ నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు నా నియోజకవర్గమే కారణం. నన్ను ఇంత గొప్పవాడిని చేసిన నా నియోజకవర్గానికి నేను సాయం చేస్తున్నా.. నా నియోజకవర్గానికి రావడానికి ఎవరి అనుమతి అవసరం లేదు. ఇక్కడ ఎవరూ జాగీర్దార్లు కారు.’ అంటూ కడియం తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ప్రజల అనుమతితోనే స్టేషన్ ఘన్‌పూర్ వచ్చినట్లు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ఇలాంటి సమయంలో ప్రజలకు సాయం చేయాలని కాని రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఇప్పటికే గ్రూపు తగాదాలతో అయోమయంలో ఉన్న పార్టీ కార్యకర్తలు తాజా పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story