- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ప్రకటనలే తప్పా ఆచరణ శూన్యం’
దిశ, గజ్వేల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం అరెపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని జీవన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం అరెపల్లి, రాంసాగర్ గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలే తప్పా ఆచరణలో శూన్యం అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన చట్టాలు రాష్ట్రంలో అమలు చేస్తే రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని జీవన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లు గడిచినా గ్రూప్-1 నోటిఫికేషన్ వేయకపోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.