తెలంగాణలో ఉద్యోగాలు లేవు.. ప్రభుత్వంపై జీవన్ రెడ్డి విమర్శలు

by Aamani |
తెలంగాణలో ఉద్యోగాలు లేవు.. ప్రభుత్వంపై జీవన్ రెడ్డి విమర్శలు
X

దిశ, కామారెడ్డి: నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అసలు ఉద్యోగాలు లేవని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి రావడంతో డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావు ఆయనకు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో యువతకు నిరుద్యోగ భృతి లేదన్నారు. ప్రైవేటు టీచర్లు, జూనియర్ లెక్చరర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి, పోసానిపేట సర్పంచ్ గీతా రెడ్డి మహేందర్ రెడ్డి, నాయకులు షేరు, గోనె శ్రీనివాస్, సిరాజుద్దీన్, గుడుగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story