ఈటల బీజేపీలో చేరితే బలహీనమే: జీవన్ రెడ్డి

by Shyam |
ఈటల బీజేపీలో చేరితే బలహీనమే: జీవన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో టీఆర్ఎస్ అవినీతికి బీజేపీ రక్షణగా నిలుస్తోందని, అవినీతి చేసిన టీఆర్ఎస్ నేతలను ఎప్పుడు జైల్లో పెడతారో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సమాధానం చెప్పాని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి అన్నారు. సీఎల్పీలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌లో చేరడం, చేరకపోవడం ఈటల రాజేందర్ ఇష్టమని, బీజేపీలో చేరడం వల్ల బలహీనపడ్డారని చెప్పారు. స్వతంత్ర అభ్యర్థిగా ఈటల పోటీ చేస్తే వేరే విధంగా ఉండేదని, ఈటల రాజేందర్ బీజేపీలో చేరతానని చెప్పి తన వ్యక్తిత్వాన్ని తగ్గించుకున్నారని జీవన్​రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఇండిపెండెంట్‌గా నిలబడితే 50 వేల ఓట్లతో గెలిచేవారని జీవన్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో ప్రభుత్వం తొలగించిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు 90 శాతం మంది దళితులే, వారిని తొలగించడం మానవత్వం లేని అమానవీయా చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలా డబ్బులు రెండు నెలల నుంచి చెల్లించడం లేదని, ఉపాధి హామీ పథకంలోని ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని జీవన్​రెడ్డి కోరారు.

Advertisement

Next Story

Most Viewed