ఖమ్మంలో మందకొడిగా సాగుతున్న పోలింగ్..

by Sridhar Babu |   ( Updated:2021-12-10 02:34:01.0  )
ఖమ్మంలో మందకొడిగా సాగుతున్న పోలింగ్..
X

దిశ, భద్రాచలం: ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా ప్రారంభమై క్రమేపీ ఊపందుకొంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 768 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వీరి కోసం ఖమ్మం, కల్లూరు, కొత్తగూడెం, భద్రాచలం లలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓటర్లు ను మాత్రమే పోలింగ్ కేంద్రం లోకి అనుమతిస్తున్నారు.

ఖమ్మం ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా తాతా మధుసూదన్, కాంగ్రెస్ అభ్యర్థిగా రాయల నాగేశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులుగా కొండపల్లి శ్రీనివాస్, కొండ్రు సుధారాణి బరిలో ఉన్నారు. ఖమ్మంలో 348, కల్లూరులో 115, కొత్తగూడెంలో 221, భద్రాచలంలో 84 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. అయితే ఉదయం 10 గంటల వరకు భద్రాచలంలో ఒక్కరు కూడా ఓటు వేయలేదు. కొత్తగూడెంలో 5, కల్లూరులో 14, ఖమ్మంలో 31 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. శిబిరాల నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడం కొంత జాప్యమైంది. ఇప్పుడిప్పుడే పోలింగ్ ఊపందుకొంటోంది. ఎమ్మెల్సీ బాలసానీ, ఎమ్మెల్యే భట్టి విక్రమార్క లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Advertisement

Next Story