- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు.. మరోసారి ‘కసిరెడ్డి’కే చాన్స్
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ అధిష్టానం తమ అభ్యర్థులను శనివారం రాత్రి ఖరారు చేసింది. ఒక స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అభ్యర్థిత్వం ఖరారు అయ్యింది. మరో సిట్టింగ్ ఎమ్మెల్సీ కూచిపూడి దామోదర్ రెడ్డికి అవకాశం లభించలేదు. దామోదర్ రెడ్డిని రాజ్యసభకు పంపాలని ఉద్దేశంతోనే పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రెండవ స్థానాన్ని ముందుగా ఊహించినట్లే మహబూబ్ నగర్ పార్లమెంటుకు కేటాయించారు.
ఈ స్థానం నుంచి బీసీ అభ్యర్థిని రంగంలోకి దించాలని ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విన్నవించారు. ఈ మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షునిగా, రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్‌గా పనిచేసిన బాద్మీ శివకుమార్ పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం మధ్యాహ్నం నుంచి రాష్ట్ర మంత్రులను పిలిపించి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సామాజిక సమీకరణలు, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.