- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
MLC ఎన్నికకు ఓటరు నమోదు ప్రక్రియ షురూ..!
దిశ, వెబ్‌డెస్క్ :
రెండు తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఓటరు నమోదు ప్రక్రియను కేంద్రం ఎన్నికల సంఘం ప్రారంభించింది.దానికి సంబంధించిన ఉత్తర్వులను మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. 29.03.2021తో ప్రస్తుత ఎమ్మెల్సీల పదవీ కాలం పూర్తవుతుండటంతో ఈ మేరకు తెలుగు రాష్ట్రాల ఎన్నికల సంఘం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం (ఒకటి).. అదే విధంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ నుంచి (రెండు) స్థానాలకు ఖాళీలు ఏర్పడనున్నాయి. ఈ ఎన్నికల కోసం ఓటర్ నమోదు ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ప్రారంభించింది. ఆక్టోబర్ నెల 1వ తేదీ నుంచి ఓటర్ నమోదుకు నోటీఫికేషన్ జారీ కానుండగా, నవంబర్ 6 వరకు కొత్త ఓటర్ నమోదుకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని ప్రకటించింది. డిసెంబర్ 1వ తేదీన ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల కానుండగా, డిసెంబర్ 31 వరకు అభ్యంతరాలు స్వీకరణ ఉంటుంది. 2021 జనవరి 12వ తేదీ వరకు అభ్యంతరాల పరిష్కరణ ప్రక్రియ కొనసాగనుంది. చివరగా జనవరి 18 ఫైనల్ ఓటర్ జాబితా విడుదల చేయనున్నట్లు తాజా ఉత్వర్వుల్లో కేంద్రం ఎన్నికలం సంఘం వెల్లడించింది.