- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేదలకు కడుపునిండా అన్నం పెట్టాలన్నదే లక్ష్యం
దిశ, నాగర్ కర్నూల్: అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందజేస్తామని శాసనమండలి సభ్యులు, ప్రభుత్వ విప్ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు గార్డెన్‌లో స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతితో కలిసి నాగర్ కర్నూల్ మండలంలో నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అనంతరం ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా విపత్కర సమయంలో కూడా అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోన్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో 3,073 మందికి తెల్లరేషన్ కార్డులు ఇచ్చామని తెలిపారు. అందరికీ కడుపునిండా తిండి పెట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అభిప్రాయపడ్డారు.
రేషన్ కార్డులపై సన్న బియ్యం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని ఆయన తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు, పింఛన్లు, రైతుబంధు, దళిత బంధు ఇలా చెప్పుకుంటూ పోతే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజల మీద ఉన్న మమకారం అర్థమవుతుందన్నారు. రేషన్ కార్డు అందుకున్న లబ్ధిదారులు అందరూ ప్రభుత్వం అందించే సన్న బియ్యంతో సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజలెవరూ మార్కెట్లో అమ్ముకోకుండా కడుపునిండా తిండితో కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలన్నారు.
అనంతరం ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని అన్నారు. కుటుంబంలో ఉన్న సభ్యులకు అనుగుణంగా బియ్యం అందజేయడం జరుగుతుందన్నారు. అంతకుముందు తెలకపల్లిలో జెడ్పీఛైర్మన్ పెద్దపల్లి పద్మావతి, జిల్లా కలెక్టర్ శర్మన్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ నాగలక్ష్మి, ఎంపీపీ నరసింహారెడ్డి, జెడ్పీటీసీ శ్రీశైలం, మున్సిపల్ వైస్ చైర్మన్ బాబురావు, శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ గోపాల్, డిప్యూటీ తహసీల్దార్ ఖాజా ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.