- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిన్న జీవన్ రెడ్డి.. నేడు శ్రీధర్ బాబు.. ‘సర్దార్జీ’ తర్వాత ఎవరు..?
దిశ ప్రతినిధి, కరీంనగర్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్య నాయకులను కలిసే పనిలో నిమగ్నం అయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లో ఉన్న మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబును కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా నిలబడడానికి కారణాలు, పార్టీలో తనకు జరిగిన అన్యాయం గురించి సర్దార్ కులంకశంగా వివరించారు. సీఎం పలుమార్లు మాట ఇచ్చి అన్యాయం చేశారని, పార్టీలో కూడా ప్రాధాన్యత కల్పించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రవీందర్ సింగ్ తెలిపారు.
ఉద్యమ ప్రస్థానంలో పనిచేసిన తమపై వివక్ష చూపుతూ కొత్త వారికే ప్రాధాన్యత కల్పిస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు కాంగ్రెస్ పార్టీ తరఫున అండ దండలు అందించాలని కోరారు. పార్టీకి చెందిన వారితో పాటు వ్యక్తిగతంగా ఉన్న అనుబంధాలను ఉపయోగించి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల ఓట్లు వేయించి తన గెలుపునకు సహకరించాలని సర్దార్ రవీందర్ సింగ్ కోరారు. ఆయన వెంట మాజీ కార్పోరేటర్ సాదవేణి శ్రీనివాస్, ఎంపిటీసి వీర్ల నర్సింగరావులు ఉన్నారు.