- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో రైతు ఉద్యమం చేపడుతాం: ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
దిశ, కల్లూరు: ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలపాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు మెయిన్ సెంటర్ నందు సత్తుపల్లి శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో మండల పరిధిలోని రైతులు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులతో నినాదాలు చేస్తూ కేంద్ర బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మను శవయాత్రగా ర్యాలీ నిర్వహించి మెయిన్ సెంటర్ లో దగ్ధం చేసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.. వర్షాకాలం ధాన్యం కొనుగోలు 50 లక్షల మెట్రిక్ టన్నులు టార్గెట్ ఇవ్వగా.. ఇంకా ధాన్యం పంట సగం కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. తక్షణమే వర్షాకాల ధాన్యం ,యాసంగి ధాన్యం పంటను కేంద్ర బీజేపీ ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతుల మొర ఆలకించాలని ప్రధానికి, రాష్ట్రపతికి విజ్ఞాపన రూపంలో తెలిపేందుకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ రైతాంగానికి అన్ని విధాలా న్యాయం జరిగే వరకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు, రైతుల పక్షాన మరో రైతు ఉద్యమానికి నడుం కడతామని, కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లో ఎండగడతామని అన్నారు.