కేసీఆర్ క్యాంటీన్‌లో నాసిరకం భోజనం.. ఎమ్మెల్యే ఆగ్రహం

by Sridhar Babu |
కేసీఆర్ క్యాంటీన్‌లో నాసిరకం భోజనం.. ఎమ్మెల్యే ఆగ్రహం
X

దిశ‌, ఖ‌మ్మం: భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా కేంద్రంలో నిర్వ‌హిస్తున్న కేసీఆర్ క్యాంటీన్‌ను శుక్ర‌వారం ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర్లు ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. భోజనం నాణ్యతగా లేక‌పోవ‌డంతో నిర్వాహకుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద పేదలకు, యాచకులకు, వలస కూలీల కోసం కేసీఆర్ క్యాంటీన్‌ను ప్ర‌భుత్వ నిధుల‌తో కొన‌సాగిస్తున్నారు. అయితే, ప‌ల్చ‌టి ప‌ప్పు, నీళ్ల‌ చారుతో భోజనం పెడుతుండటంపై ఎమ్మెల్యే మండిప‌డ్డారు. నాణ్య‌మైన భోజ‌నం అందించాల‌ని సూచించారు. లేదంటే క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంద‌ని వనమా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags: MLA Vanama Venkateswarlu, outraged, kcr canteen, bhadradi kothagudem

Advertisement

Next Story