కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి.. రైతులకు అండగా నిలిచిన మాజీ మంత్రి

by Sridhar Babu |   ( Updated:2021-12-11 05:59:56.0  )
Sridharbabu1
X

దిశ, కాటారం: రైతులు పండించిన పంటను ఈ ప్రభుత్వ హయాంలో విక్రయించుకునే పరిస్థితి లేకుండా పోయిందని.. ప్రభుత్వం ధాన్యం కొనకుండా మీనమేషాలు లెక్కిస్తోంది.. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం రాశులు పోసి నెలలు గడుస్తున్నా చోద్యం చూస్తున్నారని మాజీ మంత్రి, మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆరోపించారు. శనివారం కాటారం మండలంలోని దేవరాంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను శ్రీధర్ బాబు పరిశీలించారు. ధాన్యం కాంటా వేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని, తరుగు పేరిట క్వింటాల్ కు ఆరు కిలోల ధాన్యం కటింగ్ చేస్తున్నారని, దీంతో తాము ఇబ్బందులు పడుతున్నామని రైతులు శ్రీధర్ బాబు దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయమై కొనుగోలు కేంద్రం నుండి భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మిశ్రాతో శ్రీధర్ బాబు మాట్లాడుతూ ధాన్యం కటింగ్ కాకుండా కొనుగోలు చేయాలని, ఈ ప్రాంతంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని, ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని శ్రీధర్ బాబు కోరారు. భూపాలపల్లి జిల్లాలో రైస్ మిల్లు అందుబాటులో లేకుంటే పెద్దపల్లి జిల్లాకు అలాట్మెంట్ చేయాలని శ్రీధర్ బాబు కలెక్టర్ ను కోరారు.

మినీ క్రిస్మస్ వేడుకలు

మండలంలోని దేవరపల్లి గ్రామంలోని చర్చిలో మినీ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, శాసన సభ్యులు శ్రీధర్ బాబు, కాటారం మండల పరిషత్ అధ్యక్షులు పంథకాని సమ్మయ్య, సర్పంచులు దోమల రాహుల్, అంగజాల అశోక్, మాజీ సర్పంచులు నవీన్ రావు, వొన్న వంశ వర్ధన్ రావు, నాయకులు గుడిపాటి రమేష్ రెడ్డి, రాజా వీరు, కిషన్నాయక్ పాల్గొన్నారు.

Advertisement

Next Story